'ఎన్టీఆర్' బయోపిక్ లో విద్యాబాలన్.. హాట్ టాపిక్‌గా మారిన పారితోషికం!

  • ‘ఎన్టీఆర్’ షూటింగ్ కోసం హైదరాబాద్‌లో విద్యాబాలన్
  • కోటిన్నర రెమ్యునరేషన్ తీసుకున్నట్టు వార్తలు
  • టాలీవుడ్‌లో చర్చనీయాంశం
ఆంధ్రుల ఆరాధ్య నటుడు ఎన్టీ రామారావు జీవిత కథను ఆయన తనయుడు బాలకృష్ణ తెరకెక్కిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, బాలకృష్ణ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ‘ఎన్టీఆర్’ చిత్రీకరణ జరుగుతోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్య బసవతారకంగా బాలీవుడ్ ప్రముఖ నటి విద్యాబాలన్ నటిస్తోంది. బాలకృష్ణ పట్టుబట్టి మరీ విద్యాబాలన్‌ను ఆ పాత్రకు ఒప్పించి హైదరాబాద్ తీసుకొచ్చారు. షూటింగ్ కోసం ఇటీవల హైదరాబాద్ వచ్చిన ఆమెకు బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ కొత్త విషయం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. బసవతారకం పాత్ర కోసం విద్యాబాలన్‌కు ఏకంగా కోటిన్నర రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారన్నదే ఆ వార్త. బాలీవుడ్ నుంచి తీసుకొచ్చిన ఆమెకు అంత రెమ్యునరేషనా? అంటూ టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక్క ఆమెకే అంత చెల్లిస్తే మొత్తం బడ్జెట్ ఎంత ఉంటుందన్న ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.
Go Back to Shorts
Tollywood
Vidya balan
NTR
Balakrishna

More Telugu News